బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద ఆదివారం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. ఇటీవల నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ జలకళ సంతరించుకుందని అన్నారు. చాలా రోజుల తర్వాత ఇంత వరద నీరు చూస్తున్నామని రైతులు తెలిపారు. నీరు ప్రవహిస్తున్న కారణంగా పాదచారులు, వాహనదారులు ఆనకట్ట పైనుండి వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఆయు కట్టు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటించాలన్నారు.