ఆషాడ మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఒంగోలులో అత్యంత శోభాయమానంగా శ్రీగిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. బాపూజీ గో సంరక్షణ సంఘం వద్ద నుండి అత్యంత నయన మనోహరంగా అలంకరించిన తేరుపై స్వామివారి ప్రతిమను స్థిరపరిచి, గోవింద నామాలు చదువుతూ భక్తులు శ్రీగిరి శ్రీనివాసుని దర్శించుకొనుటకు శ్రీగిరి చేరారు. శ్రీగిరి పురవీధులు స్వామివారి నామస్మరణతో మారుమోగాయి.