ఒంటిమిట్ట మండలంలో పెన్న పేరూరు రెవెన్యూ గ్రామంలో ఓబులేసు కోనలో గతంలో ప్రభుత్వం మాకు కేటాయించిన అసైన్డ్ భూములను వైకాపా నాయకులు తీసుకున్నారని, వెంటనే స్వాధీనం చేసుకుని అప్పగించాలని నిరుపేద లబ్ధిదారులు కడప కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వారు కోరారు.