ఒంటిమిట్ట మండలంలోని గంగ పేరూరు పంచాయతీకి చెందిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు ఓబులేసు కొనలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించారని కడప పోలీస్ కార్యాలయంలో తెదేపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకుల అండతో అతను కబ్జాలకు పాల్పడ్డాడని చెప్పారు. దీనిపై కలెక్టరు విచారణకు ఆదేశించారని, భూ దందా వెలుగులోకి రావడంతో తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు.