ఢిల్లీ: అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం.. బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం.. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయం చేస్తాం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం.. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తాం.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు.. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తాం అని నిర్మలా సీతారామన్ తెలిపారు