కేంద్ర బడ్జెట్-2024లో ఏపీకి భారీగా నిధులు ఇవ్వడంపై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. 4.1కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, పట్టణాభివృద్ధి, తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పిచడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి బడ్జెట్‌లో ఏపీ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.