కర్నూలు జిల్లా, అవుకుమండలంలోని రామాపురం గ్రామంలోని షాపు నెంబర్ - 1 రేషన్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన సరుకులను సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాముడు సోమవారం తెలి పారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ఈ రేషన్ దుకా ణంలో 633 రేషన్ కార్డులు ఉండగా 400 రేషన్ కార్డుదారులకు మాత్రమే సరుకులు పం పిణీ చేసినట్లు ఫిర్యాదులు అందటంతో తనిఖీ చేశామన్నారు. 98శాతం రేషన్ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా కేవలం 70శాతం మాత్రమే పంపిణీ చేసి మిగతా స్టాక్‌ను నిల్వ చేశారన్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2,280 కేజీలు పీడీఎస్ బియ్యం గుర్తించి సీజ్ చేశామన్నారు. అలాగే 2కేజీ రాగిపిండి, 1కేజీ రాగులు రేషన్ దుకాణంలో లేవన్నారు. వీఆర్‌వో ఓబులేసుతో కలిసి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.