ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మంచి పనులను పొగిడారని, అదీ చంద్రబాబు వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో.. మాబోటి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.