ఈ నెల 23 నుంచి మూడురోజుల పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినట్లు వివరించారు. బహిరంగ ప్రదే శా లు, చెట్లు కింద, విద్యుత్ సంభాలవద్ద ఉండకూ దన్నా రు. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న సమ యంలో వాటిని దాటే ప్రయత్నం చేయద్దన్నారు. జిల్లాలోని 27 తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించామని, అన్ని చోట్లా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.