పశువులలో వ్యాపించే వివిధ వ్యాధులపై యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహక అధికారి టీవీ సుధాకర్ వివరించారు. యాడికి మండలం కోన ఉప్పలపాడులో పశు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 32 పశువులకు గర్భకోశ పరీక్షలు చేశారు. పశువైద్యాధికారులు వెంకటసుబ్బారెడ్డి, విజ లక్ష్మి, హరిక్రిష్ణ, ఏహెచ్ఎలు, జీఏంస్లలు, సర్పంచి రామలక్ష్మమ్మ పాల్గొన్నారు.