ఎన్నికల్లో పని చేసిన ఉద్యోగులకు పారితోషికం చెల్లించాలని ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి, కార్యదర్శి జె. రామసుబ్బయ్య ఆధ్వర్యంలో మంగళవారం ప్రొద్దుటూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అజయ్ బాబును కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ సమాధానం ఇస్తూ ఈ విషయమై కలెక్టర్ కు ప్రతి పాదనలు పంపామన్నారు.