రణస్థలం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం మంత్రి రవీంద్రకు అమరావతిలోని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కొవ్వాడ అణు విద్యుత్ పునరావాస కాలనీ నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే 18ఏళ్ళు నిండిన మత్స్యకార యువతకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు.