దివ్యాంగులకు రిజర్వేషన్లు వద్దని ఐఏఎస్ అధికారి స్మితసబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ మదర్ థెరీస్సా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ సరైన అవకాశాలు రాక విద్యావంతులైన దివ్యాంగులు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారన్నారు. ఇప్పటికైనా ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు.