కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా భావన బుధవారం ఉదయం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం లోని కమిషనర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. 2019బ్యాచ్ కు చెందిన ఐఎస్ఎస్ అధికారి అయిన ఆమె ఇప్పటి వరకు సహాయ కలెక్టర్ గా కృష్ణా జిల్లాలో శిక్షణ పొందిన అనంతరం అల్లూరి జిల్లాకు జాయింట్ కలెక్టర్ పనిచేశారు. ఆమెకు ప్రభుత్వం ఇటీవల జరిగిన బదిలీలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.