బీఎన్ కండ్రిగ మండలంలోని ఆళత్తూరు, రెడ్డిగుంటబడవ గ్రామాల సమీపంలో మట్టిని తరలిస్తున్న ఏడు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటనరసింహం తెలిపారు. మంగళవారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మట్టిని ఆళత్తూరు, కొత్తపాళెం, రౌతుసూరమాల గ్రామాల వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో గుత్తేదార్లు వేస్తున్న రహదారికి తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మట్టి తరలింపుపై ఎలాంటి అనుమతులు లేక పోవడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.