మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖలో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రశ్న వేయగా.. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ.. ధూళి కణాల పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు. పొల్యూషన్ తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేయిస్తామన్నారు.