తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు వారికిస్తున్న రూ.5వేల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం వారికి శుభవార్త వినిపించడమే కాకుండా కీలక ప్రకటన చేసింది. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే వారికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.