పెద్దకడబూరు, కోసిగి మండలాల మధ్య నిత్యం నీటితో కళకళలాడే పులికనుమ ప్రాజెక్టు ప్రస్తుతం నీరు లేక అడుగంటి పోయింది. వేల ఎకరాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టు ఈ ఏడాది ఆశించిన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. ప్రతి ఏటా ఈ సమయానికి తుంగభద్ర నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ జరిగేదని, ఈ ఏడాది వరుణుడు కరుణించకపోవడంతో ఇప్పటికీ ప్రాజెక్టులో నీరు లేదని రైతులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa