కదిరి నుంచి రాయచోటి వెళ్లే రహదారి మరమ్మతులు బుధవారం వేగవంతంగా సాగుతున్నాయి. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రోడ్డు మీద గుంతలను రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేశారు. గత కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యే మూడు నెలల్లో రోడ్డు మరమ్మతులు పూర్తిచేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.