శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పాండురంగ నగర్ సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పాండురంగ నగర్ సమీపంలో చెట్లలో ఓ యువకుని మృతదేహం ఉన్నట్లు కనుగొని పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa