ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో బిల్లులు ప్రవేశపేట్టిన శాసనసభాపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 10:59 PM

తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడంతో పాటు.. మాతృ భాష ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగుభాషనే ఉపయోగిస్తూ కొత్త సంప్రదాయానికి నాందిపలికారు. మంగళవారం, బుధవారం సభలో ప్రవేశపెట్టిన బిల్లుల సందర్భంగా బిల్లులు ప్రతిపాదించే సమయంలోనూ, ఆమోదం పొందే సమయంలోనూ ఆయన పూర్తిగా తెలుగు భాషను ఉపయోగించారు. తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నానని.. సభ్యలుంతా సహకరించాలని ఆయన కోరారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో బుధవారం సభలో కొంతమంది మంత్రులు, సభ్యులు సైతం ఎక్కువుగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం సభలో విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును సంబంధింత శాఖ మంత్రి సత్యకుమార్ ఆంగ్లంలో ప్రతిపాదించగా.. బిల్లుపై చర్చ సందర్బంగా ఆయన పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. తెలుగుభాషకు మరింత ప్రాధాన్యతను పెంచే ఉద్దేశంతో స్పీకర్ అయ్యనపాత్రుడు తీసుకున్న చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa