మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ ప్రతినిధులు బుధవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి సమస్యలను పరిశీలించి వాస్తవ స్థితిగతులను గుర్తించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి రావు ఆధ్వర్యంలో నేతలు ఆసుపత్రిలోని ప్రతి విభాగం పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు, వారి సహాయకులు కూర్చునేం దుకు, గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని గుర్తించారు. చిరిగిన బెడ్లు, పాడైన వీల్ చైర్లు, స్ట్రక్చర్లను పరిశీలించారు. మూలకు చేరిన ఆర్వో ప్లాంట్, వాటర్ కూలర్ ప్లాంట్‌ను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఎక్స్‌రే విభాగంలో రేడియాలజిస్ట్‌లు, డార్క్‌రూమ్ అసిస్టెంట్లు, ఎయిడ్స్ విభాగంలో ఫార్మా సిస్ట్‌లు కొరత, గర్భిణులకు థైరాయిడ్ టెస్ట్, ఇతర టెస్ట్‌లు లేకపోవడం, ల్యాబ్‌ల్లో సామాగ్రి కొరత, అరకొర వైద్యు లు, వైద్య సిబ్బంది, మొరాయిస్తున్న జనరేటర్, పని చేయని ప్రాణ వాయువు యూనిట్, ఆసుపత్రి బయట పారి శుధ్య లోపాలను గుర్తించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళతామన్నారు. కార్యక్రమంలో నేతలు మెండ దమయంతి, కోళ్ల లవకుమార్, పోలాకి షణ్ముఖరావు, ప్రసాద్ రెడ్డి, రెయ్యి ప్రీతీష్, మధు, ప్రపుల్లా, రాజారావు, చంద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.