ఐదు నెలలుగా వేత నాలు అందలేదని... దీనికి తోడు డీఎస్‌డీఓ మానసిక వేధింపులు భరించలేక పోతున్నామని శాప్ కోచ రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆయనకు టుంబంతో వెళ్లి బుధవారం కలెక్ట రేట్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్‌కు మార్‌ను కలిసిన మొరపెట్టుకు న్నారు. తాను అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రెజ్లింగ్ పోటీలకు పనిచేసి గుర్తింపు సాధించానని తెలిపారు. అయితే ఐదు నెలలుగా డీఎస్‌డీఓ పనిగట్టుకుని ేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో అనంతపురం నుంచి పామిడికి బదిలీ చేయగా, అక్కడికే తన మకాం మార్చానన్నారు. పామిడిలోనే పిల్లలను పాఠశాలలో చేర్పించానన్నాడు. తిరిగి ఇప్పుడు అనంతపురానికి రావాలంటే ఎలా అన్నారు. డీఎస్‌డీఓ వచ్చినప్పటి నుంచి తనతో పాటు ఇతర కోచలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆ వేధింపులను తట్టుకోలేకపోతున్నామని వివరించారు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబతో కలిసి ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ...న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కోచ తెలిపారు.