ఎచ్చెర్లలోని స్థానిక రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో (ఐఐఐటీ) శనివారం 2వ రోజు కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఈ సందర్బంగా ఎంపికైన విద్యార్థులకు డైరెక్టర్ బాలాజీ నియామకపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, విద్యతోనే మంచి సమాజాన్ని రూపొందించుకోవచ్చన్నారు.