రణస్థలం మండలం ఎర్రవరం గ్రామంలోని వీధి కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దోమలు వ్యాప్తి చెంది, రోగాలు బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు చేపట్టాలని కోరారు.