క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరు, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తదితర పనులను కమిషనర్ డా. జె అరుణ శనివారం తనిఖీ చేశారు. కట్టమంచి, లాయర్స్ కాలనీ, తిరుపతి రోడ్డు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కాలువలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత యజమానులకు నోటీసులు ఇవ్వాలని అన్నారు.