తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులు శాటిలైట్ ప్రయోగం సక్సెస్ చేశారు. ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్‌ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కిలోల బరువు.. 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది. ప్రయోగం విజయవంతం అయినందుకు విద్యార్థులు, సిబ్బందికి మోహన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు వాతావరణంలోని డయాక్పెడ్ స్థాయి, ఓజోన్ సాంద్రతలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనంపై పరిశోధనలు చేస్తుందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రయోగం మొట్టమొదటగా తమ విద్యార్థులే చేశారని మోహన్ బాబు పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించడానికి ఇలాంటి ప్రయోగాలు దోహదపడుతాయని చెప్పారు.