ఎన్నికల్లో పరాజయం తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతి కేంద్రంగా పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.ఇదే సమయంలో కేంద్రం అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది.కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో జరిగిన చర్చలో వైసీపీ నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతికి కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ 15 వేలను రుణంగా కాకుండా..గ్రాంటుగా మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించాని కోరారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినటానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తున్న ట్లు మిథున్ స్పష్టం చేసారు