కనిగిరి నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర అధికారులకు సూచించారు. ఆదివారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, రైల్వే అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే పరిహారం త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.