చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణ స్వామి ఆరాధన మహోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కవిత దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహారావు ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.