అనంతపురం జిల్లా పోలీస్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సోమవారం అనంతపురం, శెట్టూరు ప్రాంతాల నుండీ వేర్వేరుగా ఇద్దరు దివ్యాంగులు వచ్చారు. నడవలేని స్థితిలో రావడాన్ని జిల్లా ఎస్పీ కేవీ. మురళీకృష్ణ దృష్టికి వెళ్లింది. వారు ఇబ్బంది పడకుండా ఎస్పీ వెంటనే అక్కడి నుండీ నేరుగా బయట ఉన్న దివ్యాంగుల వద్దకు వెళ్లారు. ఈ ఇద్దరు దివ్యాంగుల సమస్యలను లోతుగా విన్నారు.