కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక కార్యాలయం నందు సోమవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. ఆ సమస్యలను తక్షణ పరిష్కారం దిశగా ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు అధికారులతో చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.