రాష్ట్రంలో గత వైయస్ జగన్ సర్కారు ఇబ్బడిముబ్బడిగా అప్పులచేసిందంటూ చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ద్వారా జగన్ తెలిపారు. ఆరి్థక సంఘం సిఫార్సుల కన్నా ఆంధ్రప్రదేశ్ వరుసగా 2022, 2023 సంవత్సరాల్లో పరిమతి కన్నా తక్కువ అప్పులుచేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. గత మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్ విశ్లేషణాత్మక నివేదికలో ఎస్‌బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. వివిధ రాష్ట్రాల అప్పులు, తప్పనిసరి వ్యయాలు, సాధికారతతో కూడిన సంక్షేమ పథకాల వ్యయం, తలసరి ఆదాయాలతో కూడిన అంశాలను విశ్లే షిస్తూ ఎస్‌బీఐ ఈ నివేదికను విడుదల చేసింది.