ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, చాట్రాయి మండలంలోని తుమ్మగూడెంలో లైసెన్స్ లేకుండా ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్నట్లు అందిన సమాచారంతో మాదాల బెనర్జీ గోడౌన్లో సోమవారం రాత్రి విజిలెన్స్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ 1.27 లక్షల విలువైన 59.36 లీటర్ల పురుగు మందులు, రూ. 57,915 విలువైన 1480 కేజీల ఎరువులు సీజ్ చేశారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పి. శివరామకృష్ణ తెలిపారు. విజిలెన్స్ ఏవో సురేష్, మండల ఇన్చార్జి ఏవో చెన్నారావు, రెవెన్యూ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.