హైస్కూల్, కళాశాల విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి విక్రయాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల ద్వారా గంజాయి విక్రయాల సమాచారాన్ని అందించి నెమ్మదిగా ఊబిలోకి దింపుతున్నారు. ఏలూరు, భీమవరం ప్రధాన కేంద్రాలుగా కైకలూరు ప్రాంతానికి భారీగా గంజా యిని తరలించి నిరంతరంగా అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినే పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పలువురు విద్యార్థులు, యువత గంజాయి తాగుతూ తల్లిదండ్రులకు పట్టుబడిగా గంజాయి మత్తులో వారిపైనే ఎదురుతిరిగిన ఉదంతాలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇంత పెద్దఎత్తున గంజాయి వ్యాపారం జరుగుతున్నప్పటికీ ఆదిలోనే అరికట్టాల్సిన పోలీ సులు ఉదాసీనంగా వ్యవహరించడంతో భారీస్థాయిలో గం జాయి విక్రయాలు కైకలూరులో చోటు చేసుకున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో గంజాయిని అరికట్టాలని కోరుతున్నారు.