వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ అన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో మం త్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ పరిశీలించారు. ముందుగా మందడం సీడ్ యాక్సెస్ పక్కన కట్టిన టిడ్కో గృహాలను సందర్శించారు. అనంతంరం దొండపాడులో టిడ్కో ఇళ్లను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనపై లబ్ధిదారులతో మంత్రి నారాయణ మాట్లాడారు. ఇళ్లకు వచ్చే రోడ్లు సరిలేవని, నీటి సమస్య ఉందని మంత్రికి వివరించారు. ఒక్క రూపాయితో ఇళ్లు ఇస్తామని చెప్పిన జగన్‌రెడ్డి మోసం చేశాడని, రుణభారం తగ్గించాలని లబ్దిదారులు వేడుకున్నారు. గృహ సముదాయాలను, పరిసరాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా దొండపాడులో మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రతి మహిళ తన కుటుంబంతో ఆనందంగా గడిపేలా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలుడబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరతామన్నారు. రైతుల ప్లాట్లకు లోన్ ఇచ్చేలా బ్యాంకర్స్‌తో మాట్లాడమని చె ప్పారు. రాజధాని పనులు వేగవంతం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు నాసిరకం రంగులు వేసిందని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. అంతర్గత రోడ్లు కూడా నాణ్యత లేవన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు ఎర్రగోపు నాగరాజు, తాడికొండ నియోజకవ్గ బీజేపీ కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావు, రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు పుట్టి రామచంద్రరావు, తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు, మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు.