చట్టాలపై ప్రతిఒక్కరికి అవగాహన అవస రమని సీనియర్ సివిల్ న్యాయా ధికారి ఆర్.సన్యాసినాయుడు తెలిపారు. సోమవారం శ్రీకాకు ళంలోని కోర్టు ఆవరణలో న్యాయ సేవ భవన్లో న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వగతి, స్వాతి స్వచ్ఛంద మహిళా సంస్థలు ప్రజలకు దగ్గరగా వారి స్థితిగతులను చూస్తున్నాయని, మహిళల సమస్యలను నేరుగా న్యాయసేవాధికార సంస్థ వద్దకు వెళ్లి పరిష్కరిచుకోవడానికి చక్కటి మార్గం చూపుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీవో కేవీరమణ, సీడబ్ల్యుసీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి, స్వీప్ డైరెక్టర్ కె.రమణమూర్తి, పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.