కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన మదటి అజెండా అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. తమ సమస్యలను విన్నవించుకోవడానికి పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రజావేదిక వద్దకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే తక్షణమే అధికారులతో మాట్లాడి అక్కడక్కడే పలు సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ పటణంతో పాటు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా అధి కారులతో ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. అదేవి ధంగా ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికా రులకు సూచిస్తున్నామన్నారు. ఏ ఒక్కరు సమస్యతో బాధపడకూడదన్నారు.