కడప జిల్లా, నిమ్మనపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడంపై మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యా లయాన్ని ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సబ్‌కలెక్టర్ ఈ సంధర్బంగా కార్యాల యంలోని ప్రతి గదిలోని రికార్టులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రికార్డు గదిని పరిశీలించి గదిలో గందర గోలంగా పడవేసిన పైల్స్‌ను చూసి కార్యాలయ నిర్వహణ ఇదేనా అని అధికారులను ప్రశ్నించారు. ప్రజల నుంచి స్వాధీనం చేసుకొన్న నాటు తుపాకీలు సత్వరమే సంబంధిత అధికారులకు అందజేయాలని ఆదేశించారు. అంతే కాకుండా విజిటర్స్ రికార్డులు, ఫైల్స్ రికార్డులు తీసు కురావలని ఇనచార్జి తహసీల్దార్ తపస్విని అడగగా వాటిని రాయలేదని తెలుపనడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ సారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. అనంతరం కార్యాలయానికి తహసీల్దార్ బోర్డు,సీసీ కెమరాలు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది సమయసాలన పాటించి ప్రజలు నుంచి వచ్చిన అర్జీలకు జవాబుదారీగా ఉండా లని సూచించారు. ప్రస్తుతం మదనపల్లిలో జరిగిన సంఘటలనపై సిబ్బంది జాగ్రత్తంగా ఉండాలని ఎలాంటి తప్పులు జరిగినా వారిపై శాఖాపరమైన చర్చలు వుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రామ్‌ప్రసాద్ వీఆర్వోలు పాల్గొన్నారు.