ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ దక్కించుకుని పనులు ప్రారంభించకపోవంతో తెలంగాణ మంత్రి కంపెనీకి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ.. రూ.1,194 కోట్లతో ఈపీడీసీఎల్ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు టెండరును దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఏడాది కిందట దక్కించుకున్నా ఇంకా పనులు మొదలుపెట్టలేదు. వెంటనే పనులు పెట్టకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.
ఈ కాంట్రాక్ట్‌కు సంబంధించిన పనులు మొదలుపెట్టాలని ప్రతి నెలా ఈపీడీసీఎల్ అధికారులు నోటీసులు పంపిస్తున్నారు.. అయినా స్పందన లేదు. మరో నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో హెచ్చరించారు. ఆర్‌డీఎస్‌ఎస్ భాగంగా ప్రతిపాదించిన పనులను ఆ వ్యవధిలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు నిలిచిపోతుందని డిస్కం తెలిపింది.. ఇదే అంశాన్ని నోటీసులో ప్రస్తావించారు. గత ప్రభుత్వం భూగర్భ విద్యుత్ లైన్ల ప్రాజెక్టు టెండర్ల అంచనాలనూ పెంచిందనే విమర్శలు ఉన్నాయి.
రూ.1,194 కోట్లతో భూగర్భ విద్యుత్ లైన్లకు, రూ.314 కోట్లతో ఆర్‌ఎంయూల సరఫరాకు టెండర్లు ఆహ్వానించింది. అయితే తొలిసారి పిలిచిన టెండర్ విలువ కంటే రూ.343 కోట్లు అంచనాలు పెరిగాయి.. అంటే అంచనా విలువ కంటే 10 శాతం అధిక మొత్తానికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ బిడ్‌లో కోట్ చేసింది. ఈ ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద లైన్ల ఏర్పాటుతో పాటు, ఆర్‌ఎంయూల సరఫరా కలిపి రూ.1,165 కోట్లతో 2022లో స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లతో టెండర్లు పిలిచారు. అయినా స్పందనలేదు.. దీంతో 2022-23 ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో 2023 ఏప్రిల్‌లో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. భూగర్భ లైన్ల పనులకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌తో పాటు మరో రెండు కంపెనీలు అప్పట్లో బిడ్‌లు దాఖలు చేశాయి.
రాఘవ కనస్ట్రక్షన్స్‌కు ఒక్క భూగర్భ లైన్ల పనులకే ఈపీడీసీఎల్ రూ.1,285.94 కోట్లు చెల్లించనుంది. ఇది టెండర్ ధరపై రూ.91.94 కోటు చేసిన దానిపై అదనం.. దీనికి ఆర్‌ఎంయూల కొనుగోలుకు చేయనున్న రూ.314 కోట్ల ఖర్చు కలిపితే పనుల విలువ రూ.1,599.94 కోట్లకు పెరుగుతుంది. అంటే 2022 డిసెంబరులో పిలిచిన టెండరు ధరలతో పోలిస్తే ప్రాజెక్టు విలువ 37.33 శాతం పెరిగింది.. అప్పుడు మొత్తం రూ.434.94 కోట్లు అవుతోంది.