మండపేట స్థానికకలవపువ్వు సెంటరులో సమీపంలోని మున్సిపల్ స్థలం ప్రస్తుతం చీకటి పడితే గంజాయి, మందుబాబులకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. ఈప్రదేశంలో పార్కు లేదా ఇతర నిర్మాణాలు చేద్దామని, దీనికి కౌన్సిల్ సభ్యులు సహకరించాలని ఎమ్మెల్యే వేగుళ్ల కోరారు. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం చైర్‌పర్సన్ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫిషియోసభ్యుడు హోదాలో వేగుళ్ల హాజరయ్యారు. ఏడిద రోడ్డులోని అన్నక్యాం టీన్ పునరుద్ధరణకు సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదించారు. ఈ సందర్బంగా సభ్యులు చైర్‌పర్సన్‌కు ధన్యవాదాలు తెలి పారు. ఆగస్టు 15న అన్నక్యాంటీన్‌ను ప్రారంభిస్తామని వేగుళ్ల చెప్పారు.పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనంగా నిర్మించే సబ్‌స్టేష న్‌కు స్థలాన్ని సభ్యులు ఎంపిక చేయాలని వేగుళ్ల కోరారు. అజెండాలో పొందుపర్చిన జనరిక్ దుకాణం నిర్వాహకుల మార్పును వైసీపీ కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈఅంశంపై సమావేశంలో చర్చ వాడివేడిగా సాగింది. టీడీపీ ప్రభుత్వం జనరిక్ మందులు షాపు ఇచ్చినపుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు మార్చుచేసిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈఅంశాన్ని వాయిదా వేయాలని వైసీపీ సభ్యులు కోరారు. మెప్మా టీఎం లీడర్ అనంతలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న జనరిక్ సంఘ సభ్యులే స్వచ్ఛందంగా తీర్మానం చేసి ఇచ్చారని అందుకే వేరే సంఘానికి కేటాయించామని సమాధానం చెప్పారు. ఇష్టం ఉంటే ఆమోదించాలని లేకుంటే తిరస్కరిం చాలని వేగుళ్ల సభ్యులకు సూచించారు. ఈఅంశంపై చైర్ పర్సన్ సభ్యులు ఓటింగ్ కోరారు. సభ్యులు వ్యతిరేకిం చడంతో ఆ అంశాన్ని వాయిదా వేశారు. పట్టణంలో కుక్కల నిర్మూ లనకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మందపల్లి రవి కోరారు. మున్సిపల్ దుకాణాల ముందు వ్యాపారులు ఆక్రమిం చటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని టీడీపీ కౌన్సిలర్ యరమాటి గంగరాజు అన్నారు. ఇంకా పలు అంశాలను సమావేశంలో చర్చించి ఆమోదించారు. వైస్‌చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారయ్యబాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.