సమాజంలో మానవతా విలువలు పెరిగినపుడే మానవ అక్రమ రవాణాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు. మంగళవారం మదనపల్లె స్థానిక నెహ్రూ మున్సిపల్ యూపీ స్కూల్లో పోర్డు సంస్థ ఆధ్వర్యం లో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, ఇంత వరకు వారి ఆచూకీ తెలియలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే అందరు సమష్టిగా పనిచేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో హెచఎం శ్రీనివాసులు, పోర్డు డైరెక్టర్ లలితమ్మ, టీడీపీ నాయకు లు, పోర్డు సిబ్బంది పాల్గొన్నారు. కాగా మానవ అక్రమ రవాణా నేరమని గ్రామజ్యోతి సంస్థ వ్యవస్థాపకురాలు సుభద్ర పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఆవిష్కరించి, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాలూకా సీఐ శేఖర్, సీడీపీవో సుజాత తదితరులు పాల్గొన్నారు.