శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ గ్రామంలో గురువారం సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సెర్ప్ సీఈఓ వీర పాండియన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లబ్ధిదారులతో పెన్షన్లు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. కార్యక్రమంలో డీపిఎం ఫైనాన్స్ రామిరెడ్డి, ఏపిఎంలు నాగేంద్ర, రామకృష్ణ, ఎంపీడీవో , సీసీ శ్రీనివాసుల, విఓఏలు పాల్గొన్నారు.