సిలికాసాండ్, క్వార్ట్జ్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులున్నాయని, వాటిపై దృష్టిసారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్రమాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు సేకరించాలన్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో జరిగిన అక్రమాలను తవ్వితీయాలని ఆదేశించారు. కాగా, మంగంపేటలోని బెరైటీస్ టెండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని గనులశాఖ ముఖ్యకార్యదర్శి మీనా నివేదించారు. ధరలపై నిర్ణయం తీసుకున్నాకే టెండర్లపై స్పష్టత ఇస్తామన్నారు. సీనరేజీ, బొగ్గు కాంట్రాక్టులపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, డీసిల్టింగ్ పాయింట్ల ఏర్పాటుకు 15 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు కోరారు.