మధ్య ప్రదేశ్లోని జబల్‌పూర్ లో నెలకొని ఉంది శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి పచ్చమాత ఆలయం. మూలవిరాట్టు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం నీలంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 7 శుక్రవారాలు దర్శించుకుంటే ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి పాదాలపై సూర్య కిరణాలు పడుతుండటం ఇక్కడి మరో విశేషం. ఇప్పుడున్న ఆలయాన్ని 1100 ఏళ్ల క్రితం గోండ్వానా పాలకులు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.