గార్లదిన్నె మండలంలోని ఆర్ యస్ కల్లూరు స్టేట్ బ్యాంక్ ఏటిఎంలో నగదును శుక్రవారం గుర్తు తెలియని దుండుగలు చోరీ చేశారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ను పగలగొట్టి అందులో ఉన్న నగదు దోచుకెళ్ళారు. చోరీకి పాల్పడింది రాజస్థాన్ కి చెందిన దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను వారు పరిశీలించారు.