కర్నూలు జిల్లాలోని కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జలశయం నుంచి 33 గేట్ల ద్వారా నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 1631,14 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 1,71,353 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,74,675 క్యూ సెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 98,414 టీఎంసీలుగా కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేసిన నేపథ్యంల నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.