ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీం కోర్టు తీర్పుపై పునరాలోచించాలని రాష్ట్ర మాల మహానాడు సంఘ సభ్యులు, ఎస్సీ ఉద్యోగ సంఘాల నాయకులు ఎద్దు లిల్లీ పుష్పనాథం, ఎన్.భరత్‌భూషణ్, బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. పాలకొండ, ఏలాం కూడలిలో నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతోఓ దళిత ఉద్యోగ కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు, దళిత యువసేన సభ్యులు రాకోటి వెంకటరావు, మడపల ప్రసాదరావు, తిర్లంగి ఉపేంద్ర, బొంతు గవరయ్య, రాజుకుమార్, పొట్నూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.