అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నూతన విద్యా విధానంపై చర్చించడం ఆనందంగా ఉందన్నారు. నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారన్నారు. ‘‘యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను. మీరంతా విద్యావేత్తలు.. మీకన్నా నాకు ఎక్కువ అంశాలు ఇందులో తెలియవు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉన్నా. మరో అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారు’’ అని తెలిపారు.