కొవ్వాడ ఎర్ర కాలువలను ఆధునికీకరించడానికి అవసరమైతే కేంద్ర నిధులను తీసుకుని వస్తానని.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువ, తాడిపూడి కాలువ వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాలువల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నామన్నారు. ప్రస్తుత సీజన్‌లో తుఫాను అధిక వర్షాల ప్రభావంతో 2300 ఎకరాలు ముంపునకు గురయ్యాయన్నారు. ప్రతి సంవత్సరం తుఫాన్ వల్ల 5000 ఎకరాలు రైతులు నష్టపోతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. పంట నష్టం వివరాలను అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు.